సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.