హీరో మంచు విష్ణు ఓ మంచి పని హాట్ టాపిక్ అవుతోంది. తిరుపతిలోని బైరాగి పట్టెడ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను హీరో మంచు విష్ణు దత్తత తీసుకున్నారు. విద్యా, వైద్యంతో పాటు అన్ని విషయంలో ఓ కుటుంబ సభ్యుడిలా తోడుంటానని ఆయన తెలిపారు. ఎలాంటి స్వలాభం లేకుండా మంచి హృదయంతో మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి 120 మందికి పైగా అనాథలను ఆదరిస్తున్నారని, వారికి అన్నగా, పెద్దగా తోడు ఉంటానని, వారంతా…