ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ నిర్మాణాత్మక మార్పులకు సిద్ధమైంది. రాబోయే నెలల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. శ్రామిక శక్తిలో 10 శాతం తగ్గుతుందని ప్రకటించింది. దీంతో దాదాపు 17,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, ఉద్యోగులపై తొలగింపు ప్రభావం చూపుతుందని బోయింగ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ తెలిపారు.