Odisha: భార్యపై అనుమానంతో పసిపాప ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు ఓ కసాయి తండ్రి. బిడ్డకు పురుగుమందు ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగింది. పసికందును సోమవారం బాలాసోర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంగళవారం వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరుపుతున్నట్లు బాలసోర్ ఎస్పీ సాగరిక నాథ్ వెల్లడించారు.