భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ముఖ్యమయిన స్థానం వుంది. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి అని చెబుతారు. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుందంటారు. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని బంగారంలా మెరిసేలా చేస్తుంది. భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల ద్వారా స్వామి…