RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులపై పెనాల్టీ విధించిన ఆర్‌బిఐ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో పనిచేస్తున్న రెండు సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది.