Maldives: ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చి, చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాన్ని అవలంభించిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకి త్వరగానే తత్వం బోధపడింది.
ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జూతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం సంబంధాల మరింతగా పెరిగే విషయాన్ని జైశంకర్ నొక్కి చెప్పారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఆహ్వానం మేరకు జైశంకర్ ఆగస్టు 11 వరకు మూడు రోజుల పర్యటనకు వెళ్లారు.
వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌లు, రిసార్ట్స్‌లో సేద తీరుతుంటారు. ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్‌కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్‌కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్‌గా పెట్టుకుంటుంటారు.