బాలీవుడ్ నటి మలైకా అరోరా శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదిటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా…