బాలీవుడ్ నటి మలైకా అరోరా శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదిటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఆమెను కొంతకాలం పరిశీలనలో ఉంచుతారని అమృత తెలిపారు.
Read Also : Ante Sundaraniki : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో 38కిమీ పాయింట్ వద్ద ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇది తరచుగా ప్రమాదాలకు గురయ్యే ప్రాంతం. మలైకా కారుతో పాటు మరో రెండు కార్లు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయని, యాక్సిడెంట్ లో మూడు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు అక్కడి నుంచి పారిపోయారు. వారికి ఎలాంటి గాయాలు అయ్యాయో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.