టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ‘మేజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ‘మేజర్’ చిత్రం 2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ…