ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు “వైఎస్ రాజశేఖర్ రెడ్డి” జీవితం ఆధారంగా డైరెక్టర్ మహి.వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ‘వైఎస్ఆర్సీపీ’ కార్యకర్తలని మాత్రమే కాకుండా సినీ అభిమానులందరినీ మెప్పించింది. 2019లో రిలీజ్ అయిన యాత్ర మూవీ గత ఎన్నికల్లో జగన్ కి, వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే డైలాగ్ ని…