Varanasi Movie: మహేష్ బాబు అభిమానుల ఉత్సాహం మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం సాయంత్రం మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మహేష్ బాబు ఎంట్రీ నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే హీరో ఎంట్రీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రాజమౌళి-మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పేరు వారణాసి. ఈవెంట్‌లో ముందుగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం…