దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. టమాటా ధరలు పెరగడం వల్ల దొంగతనాలు చాలా వరకు పెరిగిపోయాయి. ఇక అక్కడే ఉండి కాపలా కాయడం చాలా కష్టమని భావించిన రైతన్న తన పొలంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.