మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మొబైల్‌లో రమ్మీ ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వివాదం మొదలైంది. ఈ సంఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. శివసేన కూడా మాణిక్‌రావ్ కోకటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.