నాలుగేళ్ళ ప్రాయం నుంచీ కెమెరా ముందు అదరక బెదరక నటించిన శ్రీదేవి నాయికగా నటించిన తొలి చిత్రం ఏది అంటే? తెలుగులోనా, తమిళంలోనా? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎందుకంటే ఈ రెండు భాషల్లోనూ దాదాపు ఒకే సమయంలో నాయికగా కనిపించారు శ్రీదేవి. తొలుత ‘అనురాగాలు’లో జ్యోతి అనే అంధురాలి పాత్రలో నాయికగా నటించింది. ఆ సినిమా శ్రీదేవికి మంచి పేరు తెచ్చింది. అదే సమయంలో తమిళంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రధారులుగా కె.బాలచందర్…