బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా సాగుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వెలుగు చూసిన సిద్ధిఖీ ఇప్పటి వరకూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. మొదటి నుంచీ థియేటర్ ఆర్టిస్ట్స్ కు సినిమా తారలంటే అంతగా గౌరవం ఉండదు. ఎందుకంటే, నాటకరంగంలో ఎదురుగా ఎంతోమంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా అభినయించే వీలు ఉంటుంది. అదే సినిమాల్లో అయితే కెమెరా ముందు ఎన్ని…