Hyderabad: దోపిడీ చేస్తూ పట్టుబడితే పోలీసులకి అప్పగిస్తారు. ఆపై అధికారులు శిక్షిస్తారు. అదే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏం చేసిన అడిగే వారు ఎవరు ఉండరు. డ్యూటీ పేరుతో లూటీ చేసిన ఎవరికీ అనుమానం రాదు అనుకుని.. యూనిఫామ్ ముసుగులో ఏం చేసిన చెల్లుతుంది అని పొరపాటు పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసుల అవతారం దాల్చారు. డ్యూటీకి దిగి లూటీకి పాల్పడ్డారు. చెకింగ్ పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 లక్షలను మాయం చేశారు…