Ind vs Eng 5th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఐదో టెస్టు అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. కానీ, మ్యాచ్ ఓడినా, డ్రా అయినా సిరీస్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం టీమిండియాను ఆందోళనకు గురి చేస్తుంది.