పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు భారీ షాక్ తగిలింది. న్యూజీలాండ్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెర్గూసన్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు తీవ్రమైన తొడ నొప్పితో మైదానాన్ని వీడాడు. ఫిజియోతో కలిసి మైదానాన్ని వీడిన ఫెర్గూసన్.. మరలా బౌలింగ్ చేయడానికి రాలేదు. ఫెర్గూసన్ లేని లోటు ఆ మ్యాచ్‌లో తీవ్ర ప్రభావం చూపింది.…