Home
Local Body Elections
Local Body Elections News
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో రాజకీయ సందడి ఒక్కసారిగా మొదలైంది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన.. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా నిర్ణయించారు. దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)… -
CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
అమరావతి వేదికగా కూటమి పార్టీల ముఖ్యనేతలు, కేడర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిపై ఆయన నేతలతో వివరంగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల తీరుతెన్నులపై తన అభిప్రాయాలను పంచుకుంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని,… -
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తుది ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు , ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ అధికారులు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యంగా ఇటీవల తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తలెత్తిన ఇబ్బందులను అధిగమిస్తూ, ఎన్నికలు సజావుగా పూర్తి చేసేలా కట్టుదిట్టమైన ప్లాన్ అమలు చేస్తున్నామని… -
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
విజయనగరం జిల్లాలో తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తుఫాన్ ఇప్పుడే ముగిసిందని, మరో తుఫాన్ వస్తుందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలను పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని రెండు మూడు రోజుల్లోనే అంచనా వేయాలని కోరారు. గతంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం… -
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా నామినేషన్ల ఘట్టం నుంచే అక్రమాలు, దాడులు మొదలయ్యాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ కేంద్రాలను ఆక్రమించడం, బి-ఫారాలను మాయం చేయడం, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు చేయించడం, చివరికి రిటర్నింగ్ ఆఫీసర్లే నామినేషన్ పత్రాలను చింపేయడం వంటి దారుణాలు తొలిసారిగా చూస్తున్నామని విమర్శించారు. అధికారులను,… -
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నప్పటికీ, రాష్ట్రంలో టీడీపీ నేతలు అరాచకాలు, దాష్టీకాలు, దమనకాండ సాగిస్తున్నారని ఆరోపించారు. బైండోవర్ కేసుల నుంచి ఏకంగా హత్యాయత్నం కేసుల వరకు తమ పార్టీ నేతలపై బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు.. నామినేషన్ల అడ్డుగింపు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ… -
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
AP State Election Commission: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు అడ్డంకులు ఎదురయ్యాయని ఫిర్యాదులు వచ్చిన చోట మరో అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులతో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం… -
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక అంశాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మూడు గంటలుగా కొనసాగుతున్న సమావేశంలో ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల గడువు, తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి SEC నివేదికలు తెప్పించుకుంది. జిల్లాలవారీగా ఉన్న పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, ఎదురయ్యే సమస్యలపై… -
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, హైడ్రామాకు కేంద్రబిందువుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైసీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు, ముందస్తు అరెస్టులు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. వైసీపీ కార్యాలయం వద్ద ముందస్తు చర్యల పేరుతో ఆయనను అరెస్ట్ చేసి, కడప టౌన్ పరిధి దాటించి వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కమలాపురం మాజీ… -
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రక్రియలో భద్రత నిమిత్తం రాష్ట్రంలో పారామిలిటరీ బలగాలను (Paramilitary Forces) మోహరించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల భద్రతపై కోర్టులో విచారణ.. వైసీపీ అభ్యర్థన తిరస్కరణ రాష్ట్రంలో మున్సిపల్ తదితర స్థానిక…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!