న్యాయ విద్యలో చేరేందుకు ప్రయత్నిస్తు్న్న అభ్యర్థులకు తెలంగాణ లాసెట్ అధికారులు శుభవార్త తెలిపారు. తెలంగాణ లా సెట్ (TS LAWCET 2024) అప్లికేషన్ గడువు ఏప్రిల్ 15తో ముగియడ నుండగా.. అధికారులు గడువును పెంచారు. ఏప్రిల్ 25వ తేదీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ గడువు సైతం అయిపోవడంతో మరోసారి గడువు పెంచుతూ.. లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ప్రకనట విడుదల చేశారు.