భార్యాభర్తలు కలిసి వ్యక్తిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహా అలియాస్ చిన్న (32) తన భార్య అనిత(30) తో కలిసి మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ లో నివాసం ఉంటున్నారు.