Ganja Smuggling: హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన మత్తు పదార్థాలు పోలీసుల రైడులో దొరుకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో మరోసారి గంజాయి స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. గంజాయి సరఫరాకు రైలు మార్గాన్ని ఎంచుకున్న ముఠా అనుమానిత ప్రవర్తనతో పోలీసులకి చిక్కింది. తనిఖీల్లో భాగంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఉన్న ఓ బ్యాగుపై అధికారులు దృష్టి సారించారు. ఆ బ్యాగు పరిశీలన చేయగా.. అందులో 13 ప్యాకెట్లుగా ప్యాక్…