వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనదైన మేనరిజమ్స్, యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ యంగ్ స్టార్, ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)తో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో ప్రదీప్ మాట్లాడుతూ.. తన నిజజీవితంలోని ప్రేమ పాఠాలను సరదాగా పంచుకున్నారు.…