భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్ష సూచనల ప్రభావం కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు ఐఎండీ పేర్కొంది. సముద్ర…