Vijay Devarakonda: అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత జయాపజయాలను పట్టించుకోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కుతోంది.