Today (23-01-23) Business Headlines: జూన్ కల్లా ‘విశాఖ’ విస్తరణ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. విశాఖపట్నంలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ పనులను జూన్ చివరికి పూర్తిచేయనుంది. ఈ రిఫైనరీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 83 పాయింట్ 3 లక్షల టన్నులు కాగా దాన్ని దాదాపు రెట్టింపునకు.. అంటే.. ఒకటిన్నర కోట్ల టన్నులకు చేర్చుతున్నారు. ఈ విషయాలను HPCL చైర్మన్ పుష్ప్ జోషి వెల్లడించారు.