గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికం అయిపోయింది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.