ENG vs SA: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం 131 పరుగులకే ఆల్ అవుట్ అయిన ఆతిథ్య జట్టును, దక్షిణాఫ్రికా 7 వికెట్లు, 175 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ స్మిత్ (54) తప్ప మిగతావారంతా తేలిపోయారు. ప్రస్తుత వన్డే వరల్డ్ నెం.1 బౌలర్ కేశవ్ మహరాజ్ తన…