రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు, పరిష్కారాలు అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వ్యూహాత్మక సహకారం అందించనుంది. టీ హబ్లో గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ…