China J-35A: ప్రపంచానికి సవాల్ విసిరే ఆయుధ సంపత్తిని శనివారం చైనా ప్రదర్శించింది. ఇందులో ఒక ఆయుధం ప్రత్యేక ఆకర్షిణగా నిలవడమే కాకుండా సైలెంట్ కిల్లర్ అనే పేరును సొంతం చేసుకుంది. చైనా శనివారం చాంగ్‌చున్ ఎయిర్ షోలో తొలిసారిగా తన J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌ను యాంటీ-రేడియేషన్ క్షిపణితో కలిపి ప్రదర్శించింది. దీనిని చైనా తన ఆధునిక ఫైటర్ జెట్‌లను వైమానిక పోరాటానికి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మిషన్లకు కూడా సిద్ధం చేస్తోందనడానికి స్పష్టమైన…