Tejas Mk-1A: భారత అమ్ముల పొదిలోకి తేజస్ కొత్త మార్క్ చేరనుంది. దేశ వైమానిక దళానికి కేంద్ర ప్రభుత్వం 97 తేజస్ యుద్ధ విమానాల బూస్టర్ డోస్‌ను ఇవ్వనుంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్)తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రధాన ఒప్పందాన్ని ఆమోదించిన నెల తర్వాత, వైమానిక దళం బలోపేతం కోసం…