పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా 'అందాల రాక్షసి'తోనే వెండితెరపై వెలిగిన లావణ్య జనం మదిలో ఆ సినిమా టైటిల్ గానే నిలచిపోయింది.
తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసింది లావణ్య త్రిపాఠి. ‘అందాలరాక్షసి’గా జనం ముందు నిలచిన లావణ్య త్రిపాఠి, తన అందాల అభినయంతో ఆకట్టుకుంటూ సాగింది. తెలుగు సినీజనం లావణ్యకు మంచి అవకాశాలే కల్పించారు. ఆమె కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయడానికే తపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ…