సెల్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రిలయన్స్ జియో-గూగుల్ కలిసి రూపొందిస్తున్న జియో ఫోన్ ‘నెక్స్ట్’ లాంచింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ ఫోన్‌ను దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో కొత్తగా స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారికి కూడా అందుబాటు ధరలో ఫోన్‌ను తీసుకురావడం ఆనందంగా…