యావత్ ప్రపంచంలోని భారతీయులు దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కరోనా కారణంగా గతేడాది పెద్దగా ఈ పండుగను నిర్వహించుకోలేకపోయారు. కరోనా నుంచి క్రమంగా బయటపడుతుండటంతో దీపావళి వేడుకను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి రోజున పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలిస్తే, ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం టపాసులకు బదులుగా కర్రలతో కొట్టుకొని రణరంగం సృష్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు.…