గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని అన్యాయంగా లాగేసుకున్నారని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత కాళ్లపై పడి రైతులు వేడుకున్నారు. గణపురం మండలం కొండాపూర్ శివారులో గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న 8/151 సర్వేనెంబర్ లోని రెండున్నర ఎకరాల భూమిని బాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పట్టాచేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జాయింట్…
హైదరాబాద్ నడిబొడ్డున… అదీ జూబ్లీహిల్స్.. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో దర్జాగా భూ దందా..! ఒకటి కాదు రెండు కాదు… అక్షరాలా 15 వందల కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది.. గిమ్మిక్కులతో జిమ్మిక్కులు చేసి… లొసుగుల్ని అనుకూలంగా మలుచుకుని ఫిల్మ్‌నగర్‌లోని పదెకరాలు కారుచౌకగా కొట్టేయడమే కాకుండా… మరో నాలుగున్నర ఎకరాలకు ఎసరుపెట్టింది ఎవరు? రెడ్‌ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్నదెవరు అంటే ఇద్దరు బడా నేతలన్నది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి ఈ ప్రైమ్ ల్యాండ్‌లో చక్రం తిప్పారు.…
తనకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్పకాదు అని స్పష్టం చేశారు మంత్రి ఈటల రాజేందర్.. ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ కాగా.. విచారణకు సైతం ఆదేశించారు సీఎం కేసీఆర్.. అయితే, ఈ పరిణామాల తర్వాత వివరణ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని ప్రకటించారు.. భూ కబ్జా ఆరోపణలు కట్టుకథలుగా కొట్టిపారేసిన ఆయన.. 20 ఏళ్లుగా ఈటల అంటే ఏంటో అందరికీ తెలుసన్నారు..…