వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే, భూయజమానులకు యాజమాన్య హక్కు కార్డుల జారీ తదితర అంశాలపై మంత్రుల కమిటీ అధికారులతో చర్చించింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కుతో కూడిన కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు మంత్రుల…