USA: సోలార్ ప్రాజెక్టుల వ్యవహారంలో లంచాలు ఇచ్చాడని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా అభియోగాలు మోపింది. అయితే, అమెరికా రిపబ్లికన్ లా మేకర్ లాన్స్ గూడెన్ అదానీకి మద్దతుగా నిలిచారు. బైడెన్ తన పదవి నుంచి దిగిపోయే సమయంలో, మిత్రదేశాల మధ్య సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు.