రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటామని బీజేపీ నేత హామీ ఇచ్చారని, కానీ అది ఏనాడూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీపై లాలూ యాదవ్ మండిపడ్డారు.