తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, దీనిని అత్యంత ప్రమాదకరమైన ‘కేటగిరి-1’ డ్యామ్‌గా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతర తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటిగా ఉంది.…