Pakistan: పాకిస్తాన్‌లో అనుకోని ప్రమాదం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా(కేపీకే) ప్రావిన్సులో ‘‘మోర్టార్ షెల్’’ పేలుడుతో ఐదుగురు పిల్లలు మరణించారు. మరో 13 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.