బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తొలి విడతలో ఇప్పటివరకు 58 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో మొత్తం 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.…