మామూలుగా అయితే బెండకాయలు కిలో రూ.30 లేదా రూ.40 వరకు ఉంటాయి. కానీ, ఆ బెండకాయలు మాత్రం మటన్ ధర పలుకుతున్నాయి. అందులో స్పెషల్ ఏముంది అంటే అంతా స్పెషలే అంటున్నారు. ఎందుకంటే, ఈ బెండకాయలు ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. సాధారణ బెండకాయలతో పోల్చితే ఇందులో ఉండే పోషకాలు అమోఘం. గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది. 40 రోజుల్లోనే ఈ పంట చేతికి వచ్చినట్టు మధ్యప్రదేశ్ కు చెందిన రైతు…