తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల…