Congress: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.