Isro: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం దేశంలో రెండో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌కి శంకు స్థాపన చేశారు. తమిళనాడు కులశేఖరపట్టణంలో ఈ స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఇన్నాళ్లు ఇస్రో రాకెట్ ప్రయోగాలకు కేరాఫ్‌గా ఏపీలోని శ్రీహరికోట ఉంది. గత దశాబ్దాలుగా ఈ శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 700 కిలోమీటర్ల దూరంలో కొత్త స్పేస్‌పోర్ట్ రాబోతోంది. ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌ని చిన్న శాటిలైట్స్, లోఎర్త్ఆర్బిట్(LEO)లోకి ప్రయోగించే ఉపగ్రహాల కోసం ఉపయోగించనున్నారు.