కూకట్‌పల్లి మైనర్ బాలిక మర్డర్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో సహస్రాణి తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సహస్ర పేరెంట్స్ రేణుకా, కృష్ణలను విచారిస్తున్నారు. అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ హిస్టరీ, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ఇంటి సమీపంలో అనుమానితులు, పాత కక్షలు, కుటుంబ కలహాలు, గొడవలు ఎవరి పైన అయిన అనుమానం ఉందా? Also…
సంచలనం రేపిన కూకట్‌పల్లి మైనర్ బాలిక మర్డర్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. మర్డర్ జరిగి 24 గంటలు గడిచినా.. ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. ఐతే ఈ కేసులో కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అంతే కాదు మర్డర్ జరిగిన ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. అసలు సహస్రాణిని హత్య చేసిందెవరు? ఎందుకు బాలికను చంపేశారు? ఏ కారణంతో హత్యకు పాల్పడ్డారు? అనే విషయాలు తేలాల్సి ఉంది.…