ఏపీలో రాజకీయం మారుతోందా? మూడో రాజకీయశక్తి వైపు అడుగులు పడుతున్నాయా? టీడీపీ, వైసీపీలకు పోటీగా మరో రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. గోదావరి తీరం నుంచి కొత్త రాజకీయ పవనాలు వీస్తున్నాయి. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో రాజకీయశక్తిని తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీసీ, ఎస్.సి నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.…