బ్యాక్ లాగ్స్ ను క్లియర్ చేయడానికి స్టూడెంట్స్ తపిస్తున్నట్టుగా, గతంలో తొలి కాపీని సిద్దం చేసిన నిర్మాతలు తమ చిత్రాలను ఇప్పుడు బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన సినిమానే ‘క్షీరసాగర మథనం’. నిజానికి ఇది యేడాది క్రితం రావాల్సిన సినిమా. ఏడుగురు వ్యక్తుల జీవితంలోని భావోద్వేగాల సమ్మిళితంగా ‘క్షీరసాగర మథనం’ తెరకెక్కింది. ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంతో అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓ…