పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల…